హైదరాబాద్: 28°C
వార్తలు

'వేమూరు చౌకధరల దుకాణంలో సరుకుల తక్కువ'

BPT: వేమూరు గ్రామంలో పులివర్తి మేరీ ఏసుబాబు శాశ్వత డీలర్‌గా నిర్వహిస్తున్న చౌకధరల దుకాణం (నెం. 0731002)లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నిల్వల కంటే 772 కేజీల బియ్యం, 20 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు డీలర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.