హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల నమోదుకు జూలై 14 చివరి తేదీ

కృష్ణా: పెడనలో ఓటర్ల నమోదు ప్రక్రియపై తహసీల్దార్, ఏఈఆర్ఓ వహీదా రెహానా శుక్రవారం కీలక సూచనలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ జూలై 14తో ముగుస్తున్నందున, ఓటర్లు తమ ఫారాలను పూర్తి వివరాలతో నింపి బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్‌ను సరిచూసుకొని, అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోకుండా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.