హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

KRNL: కోడుమూరులో MLA బొగ్గుల దస్తగిరి తన నివాసంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.