MDK: శివంపేట్ మండలం గూడూర్ ప్రాథమిక పాఠశాలలో వంటగది లేకపోవడంతో టాయిలెట్ గదిలోనే మధ్యాహ్న భోజనం వండుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. పరిశుభ్రత లేని వాతావరణంలో ఆహారం తయారు చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పాఠశాలకు ప్రత్యేక వంటగది నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
పాఠశాలలో వంట గది లేక ఇబ్బందులు


