శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం విశాఖ 'ఎ' కాలనీ క్యాంప్ ఆఫీసులో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే శంకర్


