హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం: విజయ్

త్వరలో టీవీకే విశ్వరూపం అంటే ఏమిటో చూపిస్తామని తమిళనాడు సీఎం విజయ్ తెలిపారు. గతంలో అవినీతి చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీలో తమను చూసి ప్రతిపక్షనేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకువస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అలాగే పుట్టబోయే పిల్లలకు బంగారపు ఉంగరాలు ఇస్తామని తెలిపారు.