హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

NRML: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ శుక్రవారం సందర్శించి ఆలయంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే బాసరలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాన స్థలాన్ని పరిశీలించి, పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.