హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తర్‌ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా గాజియాబాద్, మేరఠ్, హాపూర్, బులంద్‌షహర్, బాఘ్‌పత్, ముజఫర్‌నగర్, మొరాదాబాద్ జిల్లాలలోని పాఠశాలకు అధికారులు సెలవు ప్రకటించారు.