ఉత్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చార్‌ధామ్ యాత్రకు కొన్ని గంటలపాటు అంతరాయం కలిగింది. అలాగే, ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని పాఠశాలలను మూసివేశారు.
వార్తలు
చార్‌ధామ్ యాత్రకు అంతరాయం


