హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో కొండచరియలు విరిగిపడడంతో పలువురు మృతిచెందారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.