రాజస్థాన్‌లో అరుదైన ఘటన జరిగింది. ఓ మహిళ ఒకే ప్రసవంలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఝలావర్‌కు చెందిన 25 ఏళ్ల జ్యోతి కశ్యప్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ పుట్టారు. అయితే వీరు నెలలు నిండకుండా, బరువు తక్కువతో జన్మించడంతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దేవుడు తమకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడిని ప్రసాదించాడంటూ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.
వార్తలు
ఒకే ప్రసవంలో నలుగురు శిశువులు


