హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలు గొప్ప తల్లులుగా మారాలి: గవర్నర్

మహిళలు గొప్ప వృత్తులను చేపట్టడం కంటే ముందు.. గొప్ప తల్లులుగా మారాలని యూపీ గవర్నర్ ఆనందీ బెన్ సూచించారు. వివాహం తర్వాత కుటుంబంలో తమ పాత్రలను సమతుల్యం చేస్తూ.. వృత్తిపరమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పిల్లలు కళాశాలల్లో చేరిన తర్వాత తల్లిదండ్రులు తమ బాధ్యత ముగిసిపోయిందని భావించకూడదన్నారు. ఈ వయసులో నైతిక విలువల గురించి వారికి బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు.