హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు బజార్ ఆధునీకరణకు నిధులు మంజూరు

అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి రైతుబజారు ఆధునికీకరణకు రూ.49 లక్షలు కేటాయించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తెలిపారు. ఈ నిధులతో 20 కొత్త షాపులు నిర్మించడంతో పాటు 30 పాత దుకాణాలను మరమ్మతు చేయనున్నారు. మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చి, వర్షాకాలంలో బురద సమస్య లేకుండా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.