హైదరాబాద్: 28°C
వార్తలు

కరూర్ బాధితులకు హైకోర్టులో భారీ ఊరట

కరూర్ బాధితులకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పులేదని వెల్లడించింది. ప్రభుత్వ నియామకాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పులో మరికొన్ని గంటల్లో బాధితులకు సీఎం విజయ్ నియామక పత్రాలు అందించనున్నారు.