హైదరాబాద్: 28°C
వార్తలు

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన BRS నాయకులు

MLG: వెంకటాపుర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన BRS నాయకులు కనకం సంపత్ కుమార్తె తేజశ్రీ (17) ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న BRS ములుగు నియోజకవర్గ నాయకులు భూక్య జంపన్న ఈరోజు వారి నివాసానికి వెళ్లి మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.