హైదరాబాద్: 28°C
వార్తలు

'ఐటీడీఏలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి'

MLG: ఏటూరునాగారం ITDAలో ఎస్వో, ఏవో, ఏపీవో తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో గిరిజనులకు సేవలు ఆలస్యమవుతున్నాయని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి అన్నారు. సంక్షేమ పథకాల అమలు, భూ సమస్యల పరిష్కారంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసి ఐటీడీఏ పరిపాలనను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.