మేఘాలయ హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను అమాయకురాలినని, ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ కేసు కేవలం అనుమానాలు, కొన్ని పరిస్థితుల ఆధారంగానే నడుస్తోందని.. కేవలం ఆరోపణలనే నేర నిరూపణగా పరిగణించలేమని పేర్కొంది.
వార్తలు
నేను అమాయకురాలిని: సోనమ్


