కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి అదుపుతప్పి రైలు కింద పడబోయిన ఘటన యూపీలో జరిగింది. వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్‌లో నిజాముద్దీన్-జబల్ పూర్ రైలు బయలుదేరుతున్న సమయంలో రమేశ్ అనే వ్యక్తి కోచ్ నుంచి దిగటానికి యత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి కిందపడబోయాడు. దీనిని గమనించిన రైల్వే కానిస్టేబుల్ అతడిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా పట్టుతప్పి..


