TG: జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి మద్యం మత్తులో దొంగిలించి తీసుకెళ్లాడు. పాలకుర్తికి చెందిన వెంకన్న బస్సును స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్లు ప్రయాణించాడు. సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
వార్తలు
మద్యం మత్తులో RTC బస్సును ఎత్తుకెళ్లాడు


