కోనసీమ: మల్కిపురం మండలంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కొత్తపేట EE రాంబాబు తెలిపారు. లక్కవరం సబ్2స్టేషన్ పరిధిలోని లక్కవరం, రామరాజులంక, శంకరగుప్తం, బట్టెలంక తదితర గ్రామాల్లో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకి అంతరాయం


