హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: GWMC కమిషనర్

WGL: నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఇవాళ GWMC కమిషనర్ వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వధశాలలతో పాటు నిర్మాణంలో ఉన్న కల్వర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణను తనిఖీ చేసి పరిశుభ్రతలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.