హైదరాబాద్: 28°C
వార్తలు

సుడా బాధ్యతలు కలెక్టర్‌కు

KNR: కరీంనగర్ శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పాలనా బాధ్యతలు తాత్కాలికంగా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించే వరకు కలెక్టర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. సుడా పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగనుంది.