హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన డంప్ యార్డ్.. శిథిలాల కింద 23 మంది

పూణె పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ ప్రమాదం జరిగింది. మోషి గార్బేజ్ డంపింగ్ యార్డ్‌లోని చెత్త కుప్ప ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నివాస భవనంపై పడింది. దీంతో దాదాపు 23 మంది డంప్ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 14 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.