హైదరాబాద్: 28°C
వార్తలు

గాల్లో చక్కర్లు కొట్టిన 10 విమానాలు!

చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక భారీ వర్షం వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి చెన్నైకు వచ్చిన 10 విమానాలు ల్యాండింగ్ కాలేక గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టాయి. చివరకు వాతావరణం అనుకూలించాక అవన్నీ సురక్షితంగా ల్యాండయ్యాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.