హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులకు కేంద్రం రూ.60 వేల సబ్సిడీ అందిస్తోంది. ఈ స్కీమ్ కింద ఇళ్లపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే BCలకు అదనంగా రూ.20 వేలు రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే కుటుంబాలకు దీనిని వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో 27.2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.