హైదరాబాద్: 28°C
వార్తలు

ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేతతో మోదీ భేటీ

ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రతిపక్ష నేత ఆంగస్ టేలర్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, ఆంగస్ ప్రధానంగా చర్చలు జరిపారు. ఈ మేరకు భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఆస్ట్రేలియా అధికార, ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.