GNTR: అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సరికొత్త రికార్డు సాధించింది. ఈ నివాస సముదాయాల నిర్మాణంలో 15 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఎలాంటి గాయాలు, ప్రమాదాలు జరగకుండా పనులు వేగంగా సాగడం విశేషం. కచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించడం వల్లే ఇది సాధ్యమైందని సంబంధిత సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు
హ్యాపీనెస్ట్ నిర్మాణంలో అరుదైన ఘనత..!


