హైదరాబాద్: 28°C
వార్తలు

పైప్‌లైన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం మండలం క్యాంబిల్ పేట త్రాగునీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నంలో ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.