హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తమిళనాడు సీఎం విజయ్ జన్మదిన వేడుకలను పాఠాశాలల్లో నిర్వహించడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జూన్ 22న టీవీకే కార్యకర్తలు పార్టీ జెండా, గుర్తులతో పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారని పిటిషన్ దాఖలైంది. తిరువళ్లూరు జిల్లాలో 3000 మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి విజయ్ ముఖచిత్రం వచ్చేలా చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.