హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళల భద్రతపై ‘శక్తి యాప్’ అవగాహన

బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ‘శక్తి యాప్’ పనితీరు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. మహిళలు అత్యవసర సమయాల్లో ఈ యాప్‌ను ఉపయోగించి పోలీసుల రక్షణ పొందాలన్నారు.