హైదరాబాద్: 28°C
వార్తలు

స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీగా రేపల్లె

BPT: రేపల్లె మున్సిపాలిటీని సెకండ్‌ గ్రేడ్‌ నుంచి స్పెషల్‌ గ్రేడ్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కాకర్ల సాంబశివరావు గురువారం తెలిపారు. ఈ హోదాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు, గ్రాంట్లు లభించి పట్టణంలో పౌర సౌకర్యాల అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతుందన్నారు.