హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే స్టేషన్ వద్ద 10 రోజుల పసికందు లభ్యం

TG: నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్ వద్ద పసికందు లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు 10 రోజుల పసికందును డ్రైనేజీలో వదిలి వెళ్లారు. మూడో ఫ్లాట్‌ఫాం వద్ద డ్రైనేజీ కాల్వలో ప్రాణాలతో ఉన్న మగశిశువు లభ్యమైంది. రైల్వే పోలీసులు శిశువును గుర్తించి మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, శిశువుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.