హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలో రూ.20కే లీటర్ పెట్రోల్

ఇథనాల్‌పై ఎలాంటి భయాలు అవసరం లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. E-20 వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. త్వరలో లీటర్‌కు రూ.20కే E-85 ఇంధనాన్ని విక్రయిస్తామని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే కీలక కార్యక్రమం అవుతుందని పేర్కొన్నారు.