హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఏలూరు 11కేవీ పవర్ పేట ఫీడర్ లైన్ మరమ్మతులు, చెట్ల తొలగింపు పనుల కారణంగా రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎన్జ రోడ్, వసంత మహల్ సెంటర్, కర్ర వంతెన, పవర్పేట, పాత బస్టాండ్, పాండురంగపురం, గూడ్స్ షెడ్ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.