హైదరాబాద్: 28°C
వార్తలు

కోరమాండల్ ఎరువుల బస్తాలు సీజ్

కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన కోరమాండల్ 28:28:0 రకం ఎరువుల బస్తాలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాత నిల్వలను విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేసి వీటిని సీజ్ చేశారు. వ్యవసాయాధికారి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.