హైదరాబాద్: 28°C
వార్తలు

శోభన్ బాబు సతీమణి కన్నుమూత

దివంగత నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపతుడున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పాయి. శోభన్ బాబు, శాంత కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.  కాగా, 2008లో శోభన్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.