హైదరాబాద్: 28°C
వార్తలు

'భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి'

KMR: జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాల్లో చేపట్టనున్న భూముల రీ సర్వే గ్రామసభలు నిర్వహించి డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ సాంకేతికతతో పారదర్శక సర్వే చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. 60 రోజులకు మించి భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు.