హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య, ఐసీడీఎస్ శాఖలు కలిసి పనిచేయాలి: కలెక్టర్

గుంటూరు జిల్లాలో గర్భస్థ మరణాల నివారణకు వైద్యారోగ్య, ఐసీడీఎస్ శాఖలు సమన్వయంతో పనిచేసి సంయుక్త బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. అధిక ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు ప్రతి ఘటనను విశ్లేషించి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.