ATP: గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామంలో రైతు సోదరులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రైతుల భూహక్కులను మరింత పటిష్ఠం చేయడంలో ఇవి ఎంతో కీలకమని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సులభంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు.
వార్తలు
పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


