హైదరాబాద్: 28°C
వార్తలు

2 లక్షల మంది రైతులతో భారీ సభ

TG: ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ఇవాళ జరిగే రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు సుమారు 2 లక్షల మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 150 ఎకరాల్లో పార్కింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, గత నెలలో నిర్వహించాలని భావించిన ఈ రైతు ఆశీర్వాద సభ.. భారీ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.