TG: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం డెడ్రా సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి ప్రవీణ్ మహాజన్ తెలిపారు. ఇటీవల ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపడంతో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో డెడ్రా, పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవికి ఒంటరిగా వెళ్లొద్దని, చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
వార్తలు
చిరుత సంచారం.. అధికారులు కీలక ఆదేశాలు


