హైదరాబాద్: 28°C
వార్తలు

‘జీసీసీల రికార్డు.. 23 లక్షల మందికి ఉద్యోగాలు’

దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వేగంగా విస్తరిస్తున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2,100కు పైగా GCCలు ఉన్నాయని, ఇవి దాదాపు 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ, ఏటా 100B US డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీలలో 500 కంటే ఎక్కువ సంస్థలు భారత్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు.