హైదరాబాద్: 28°C
వార్తలు

బీహార్‌లో దొంగల నయా స్కెచ్

బీహార్‌లోని గయా-పట్నా రైల్వే మార్గంలో దొంగలు రెచ్చిపోయారు. తేహ్‌తా-జెహానాబాద్ స్టేషన్ల మధ్య ఏకంగా 25 వేల వోల్టుల హైవోల్టేజ్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్(OHE) వైరును కత్తిరించి దొంగిలించారు. ఈ ఘటనతో సుమారు మూడు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి లైన్‌ను పునరుద్ధరించారు. RPF పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.