హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.30.40 లక్షల కోట్ల హెల్త్‌కేర్ మార్కెట్

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ఆరోగ్య సంరక్షణ రంగం డిమాండ్ 10-12 శాతం వృద్ధితో కొన్నేళ్లలో 320 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.30.40 లక్షల కోట్ల) పైగా పెరుగుతుందని 'బెయిన్ అండ్ కంపెనీ ఇండియా హెడ్ ధృవ్ సుఖ్రాని తెలిపారు. ఇది దేశీయ వైద్య సాంకేతికతలకు బలమైన మద్దతు ఇస్తుందన్నారు.