PLD: రెంటచింతల మండలంలోని పత్తి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు గురువారం పరిశీలించారు. పంట ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు శాస్త్రీయ యాజమాన్య సూచనలు చేశారు. చీడపీడలు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అధికారుల సలహాలతో సమతుల్య ఎరువులు వినియోగించి సకాలంలో పంట సంరక్షణ చేపట్టాలని సూచించారు.
వార్తలు
పత్తి రైతులకు డీఏవో సూచనలు


