హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబితా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం పూల్ బాగ్ కాలనీలో హనుమాన్ నగర్ నూతన కోర్టు భవనంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.