MDK: రామాయంపేట ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు కన్నెర్రజేశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది ప్రయాణికులు ధర్నాకు దిగారు. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో కాసేపు అక్కడ రవాణా స్తంభించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: సమయానికి రాని బస్సులు.. రాస్తారోకో


