హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

KRNL: పెద్దకడబూరు (మం) బసలదొడ్డిలో ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు సైఫుల్లా ఖాన్, చాంద్ బాషా ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈ నారాయణ స్వామి, లైన్మన్ ప్రసన్న కుమార్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు, తేమతో కూడిన స్విచ్‌బోర్డులను తాకరాదని సూచించారు.