PLD: సత్తెనపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ పీ. కిరణ్ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజుపాలెం, నెకరికల్లు, ముప్పాళ్ల ఎస్సైలు పాల్గొన్నారు. పెండింగ్ కేసులు, వారెంట్లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై చర్చించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన రాజుపాలెం కానిస్టేబుల్ రాంబాబు, నెకరికల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును సీఐ ఘనంగా సత్కరించారు.
వార్తలు
ఉత్తమ సిబ్బందికి పురస్కారాలు


