హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రమాదకర విన్యాసాలు

PLD: నర్సరావుపేట పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాల బస్సుపై ఎక్కి కొందరు విద్యార్థులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. ఈ ఘటనతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.